ముగ్గురు పాక్ పౌరుల సైబర్ నేరాలు
కెనడాలో నివసిస్తున్న నలుగురు భారతీయులతో కలిసి అక్కడి బ్యాంక్‌లను మోసం చేస్తున్న ముగ్గురు పాక్ జాతీయులను ఆ దేశ సైబర్ క్రైమ్ అధికారులు సోమవారం లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఏఐ ద్వారా నకిలీ గుర్తింపులను సృష్టించడానికి, రిమోట్‌గా బ్యాంక్ ఖాతాలను తెరవడానికి, మోసపూరితంగా క్రెడిట్ కార్డులను పొందడానికి కెనడాలో నివసిస్తున్న నలుగురు భారతీయులతో కలిసి ఈ ముగ్గురూ పనిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
- నలుగురు భారతీయులతో కలిసి
లాహోర్, అక్టోబర్ 21: కెనడాలో నివసిస్తున్న నలుగురు భారతీయులతో కలిసి అక్కడి బ్యాంక్‌లను మోసం చేస్తున్న ముగ్గురు పాక్ జాతీయులను ఆ దేశ సైబర్ క్రైమ్ అధికారులు సోమవారం లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఏఐ ద్వారా నకిలీ గుర్తింపులను సృష్టించడానికి, రిమోట్‌గా బ్యాంక్ ఖాతాలను తెరవడానికి, మోసపూరితంగా క్రెడిట్ కార్డులను పొందడానికి కెనడాలో నివసిస్తున్న నలుగురు భారతీయులతో కలిసి ఈ ముగ్గురూ పనిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కెనడా బ్యాంక్‌లు లక్ష్యంగా వీరు పలు మోసపూరిత కార్యకలాపాలు నిర్వహించారు. భారత్‌కు చెందిన దీప్ సింగ్, పర్జీత్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్, గుర్లీన్ సింగ్‌లు కెనడాలో ఉంటున్నారు. వీరు ఏఐ ద్వారా నకిలీ పాస్‌పోర్టు చిత్రాలు, ఫొటోగ్రాఫ్‌లు, ఇతర ఐడెంటిటీలు సృష్టించేవారు.
వీటిని పాక్‌లోని సహచరులకు అందజేసేవారు. దీని సహాయంతో ఆ ముగ్గురూ తమ దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్లను ఉపయోగించి ఆన్లైన్లో బ్యాంక్ ఖాతాలు తెరిచేవారు. డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాలను వీరు తమకు అనుకూలంగా మార్చుకునేవారని పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. దీనికోసం వారు డాల్ఫిన్ యాంటీ అనే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేవారు. ఖాతా తెరిచేటప్పుడు కొన్ని డిజిటల్ గుర్తింపు ధ్రువీకరణలను దాటవేయడానికి అది ఉపయోగపడేది. ఖాతా తెరిచిన తర్వాత, దాని నుంచి జారీ అయిన క్రెడిట్ కార్డులు కెనడాలోని వీరి ముఠా సభ్యులకు వెళ్లేవి. తర్వాత క్రెడిట్‌కార్డులను ఇష్టానుసారం వాడుకునేవారు. బ్యాంక్‌లకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

