Imran Khan | ఆర్మీ కంట్రోల్లో ఇస్లామాబాద్..అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు..
Imran Khan | అరెస్ట్ భయంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఓటింగ్‌కు సిద్ధపడినట్లు సమాచారం. అసెంబ్లీలో అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతున్నది.
Imran Khan | పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం శనివారం అర్ధరాత్రి హై డ్రామాకు తెర తీసింది. అనుక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్‌ఖాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పాక్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై పాక్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. మరోవైపు ఆఖరి క్షణాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మొదలైంది. ఓటింగ్ ప్రారంభమైనప్పుడు సభలో ఇమ్రాన్‌ఖాన్ లేరని సమాచారం. ప్యానల్ స్పీకర్ ఆధ్వరంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ సాగుతున్నది.
ఇస్లామాబాద్‌లో ఆర్మీ మోహరింపు
మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా ఆర్మీ తన స్వాధీనంలోకి తీసుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశం కోసం ఆర్మీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆదేశాలు వచ్చిందే తడవుగా అరెస్ట్‌లు జరిపేందుకు భారీగా బలగాలను మోహరించారు. పాక్ నేషనల్ అసెంబ్లీ ఎదుట ఖైదీల వాహనాలను నిలిపారు.
ఇలా ఇమ్రాన్ అనుకూల ప్రదర్శనలు
మరోవైపు ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. ఇమ్రాన్‌ఖాన్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అధికార నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనధికారిక వార్తల ప్రకారం ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇక గడువు ముగిసిన తర్వాత పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ తలుపులన్నీ మూసేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

