Pakistan Elections | పాక్‌లో ఆలస్యం కానున్న ఎన్నికలు.. 2024 ఫిబ్రవరి నాటికి సాధ్యంకాదన్న న్యాయశాఖ మంత్రి ఆజమ్
పాకిస్థాన్‌లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. 2023 డిజిటల్ జనాభా లెక్కల (Digital census) ఆధారంగా ఎలక్షన్స్ నిర్వహిస్తుండటంమే దీనికి కారణమని పాక్ న్యాయశాఖ మంత్రి ఆజమ్ నజీమ్ తరార్ (Law Minister Azam Nazeer Tarar) చెప్పారు.
2023 డిజిటల్ జనాభా లెక్కల ఆధారంగా సాధారణ ఎన్నికలను (General elections) వచ్చేఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోపు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రణాళికా శాఖ గత మార్చి, ఏప్రిల్ నెలల్లో సేకరించిన జనాభా లెక్కలను ఆమోదించారు. జనాభా లెక్కలు వెల్లడైన తర్వాత పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (ECP) ఎలక్టోరల్ జిల్లాల డీలిమిటేషన్ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి 120 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 9న ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దచేసినప్పటికీ గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం లేదన్నారు.
కాగా, ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్‌ను రద్దు (Dissolve Parliament) చేయనున్నట్లు ప్రధాని షెహబాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే దాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఎలక్షన్ కమిషన్‌కు సిఫార్సు చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌పై దేశాధ్యక్షుడు సంతకం చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దవనుంది.
ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (Pakistan Muslim League-Nawaz), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 9వ తేదీన నేషనల్ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి.. ప్రధాని షరీఫ్ పంపనున్నారు. అయితే జనాభా లెక్కల కారణంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

