Oxygen | పెరుగుతున్న జల ఉష్ణోగ్రతలు.. నీటిలో తగ్గిపోతున్న ఆక్సిజన్!
భూమిపై సముద్ర, మంచినీటి వనరుల్లో ఆక్సిజన్ తగ్గిపోతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది భూమిపై ఉన్న ప్రాణులకు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
- పెరుగుతున్న జల ఉష్ణోగ్రతలే కారణం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిశోధకులు
- ‘ప్లానెటరీ బౌండరీస్’లో చేర్చాలని సూచన
Oxygen | న్యూయార్క్, జూలై 20: భూమిపై సముద్ర, మంచినీటి వనరుల్లో ఆక్సిజన్ తగ్గిపోతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది భూమిపై ఉన్న ప్రాణులకు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటివనరుల్లో ఆక్సిజన్ స్థాయిలపై న్యూయార్క్‌లోని రెన్సెలియల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ కెవిన్ సీ రోస్ నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. ఈ వివరాలు ‘నేచర్ ఎకాలజీ, ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. భూమిపై జీవించే ప్రాణులకు గాలిలోని ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, సముద్రంలో, మంచినీటి వనరుల్లో జీవించే జలచరాలకు సైతం నీటిలోని ఆక్సిజన్ అంతే అవసరం.
పెరుగుతున్న గ్రీన్‌హౌజ్ వాయువు ఉద్గారాల కారణంగా నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వేడి నీరు ఎక్కువగా ఆక్సిజన్‌ను సరిగ్గా ఒడిసిపట్టలేదని పరిశోధకులు తెలిపారు. నీటిలో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నట్టు చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తమ ఆహారం, ఆదాయం కోసం జలచరాలపై ఆధారపడుతున్నారని, నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ప్లానెటరీ బౌండరీస్’లో చేర్చాలి
నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడంపై కూడా ఒక పరిమితి విధించాలని ప్రతిపాదించారు. ఇప్పటివరకు వాతావరణ మార్పు, ఓజోన్ క్షీణత, ప్రపంచ మంచినీటి వినియోగం, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం వంటి తొమ్మిది అంశాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొన్ని పరిమితులు ప్రతిపాదించారు. వీటినే ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. ఈ ప్లానిటరీ బౌండరీస్లో ఉన్న పరిమితులు మీరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడాన్ని కూడా ‘ప్లానెటరీ బౌండరీస్’లో పదో పరిమితిగా చేర్చాలని పరిశోధకులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

