చరిత్రలో ఈరోజు: ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ముద్రించి నేటికి 138 ఏండ్లు
Today History: ఏ చిన్న ఆంగ్ల పదానికి అర్థం తెలియక బుర్ర బద్దలు కొట్టుకోవడానికి బదులుగా మనం సింపుల్‌గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వెతుకుతుంటాం. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ముద్రించడం ప్రారంభమై సరిగ్గా నేటికి...

Today History: ఏ చిన్న ఆంగ్ల పదానికి అర్థం తెలియక బుర్ర బద్దలు కొట్టుకోవడానికి బదులుగా మనం సింపుల్‌గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వెతుకుతుంటాం. అంతగా మన జీవితంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ భాగమైపోయింది. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ముద్రించడం ప్రారంభమై సరిగ్గా నేటికి 138 ఏండ్లు పూర్తయ్యాయి. అనంతరం 1857 నుంచి ఏటా డిక్షనరీని ముద్రిస్తూ వస్తున్నారు.
లండన్‌కు చెందిన ఫిలోలాజికల్ సొసైటీకి చెందిన వారు క్రమపద్ధతిలో ఆంగ్ల నిఘంటువును సిద్ధం చేయాలని తొలుత భావించారు. 11 వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఎక్కువగా వాడుకలో ఉన్న ఆంగ్లో-సాక్సన్ పదాలను చేర్చారు. అప్పట్లో దీనిని 4 సంపుటాలుగా సిద్ధం చేశారు. ఇందులో 6,400 కంటే ఎక్కువ పదాలను చేర్చారు. కాగా, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తయారీకి వేలాది మంది సహకారం అందజేశారు. సర్ జేమ్స్ అగస్టస్ హెన్రీ ముర్రే, డాక్టర్ విలియం చెస్టర్ మైనర్ వారిలో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. డాక్టర్ విలియం చెస్టర్ మైనర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి 10,000 కంటే ఎక్కువ పదాలను ఇచ్చారు. 1928 లో డిక్షనరీకి ఒక రూపుకు తీసుకొచ్చారు. ఈ నిఘంటువులో 4 లక్షలకు పైగా పదాలను చేర్చి 10 సంపుటాలుగా తయారు చేశారు. దీనికి A NEW English Dictionary on Historical Principles అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రతి భాష నుంచి పలు పదాలను చేర్చుతున్నారు.
1984లో నిఘంటువు ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 120 మంది పదాలను టైపింగ్ చేసే పనిలో నిమగ్నమవగా.. 50 మంది తప్పులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా, దీని ఆన్లైన్ వెర్షన్ 2000 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 20 సంపుటాలు ఉండగా.. వీటిలో 6 కోట్ల పదాలు ఉన్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పొందుపరిచిన అన్ని పదాలను టైప్ చేయడానికి 120 ఏండ్లకు పైగా సమయం పడుతుందని అంచనా.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో తొలిసారి మిక్స్డ్ టైటిల్ గెల్చుకున్న భారత జంట మహేష్ భూపతి-సానియా మీర్జా
2004: హజ్ యాత్రలో తొక్కిసలాట కారణంగా 250 మందికి పైగా దుర్మరణం, 244 మందికి గాయాలు
2003: భూమికి తిరిగి వస్తుండగా కుప్పకూలిన అమెరికా అంతరిక్ష నౌక, కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతి
1949: అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియాను కొనుగోలు చేసిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
1884: పోస్టల్ ఇన్సూరెన్స్ పథకం ప్రారంభం
1881: ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మక, పురాతన కళాశాల సెయింట్ స్టీఫెన్స్ స్థాపన
1855: అధికారికంగా ప్రారంభమైన ఈస్ట్ ఇండియా రైల్వే
1785: చివరి కౌన్సిల్ సమావేశానికి హాజరైన గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

