Libya Floods | ఎటుచూసినా శవాలే.. లిబియా జలప్రళయంలో 5,300 మంది మృతి
Libya Floods | డేనియల్ తుఫాన్ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఈ జల ప్రళయంలో సుమారు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
Libya Floods | డేనియల్ తుఫాన్ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఆకస్మిక వదరల కారణం తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ముఖ్యంగా డెర్నా (Derna ) పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. వాహనాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ జల ప్రళయంలో సుమారు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ 1,000 మృతదేహాలను గుర్తించి ఖననం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ జల ప్రళయానికి అనేక ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయని.. ముఖ్యంగా డెర్నా నగరంలోనే ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.
డేనియల్ తుఫాన్ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
Also Read..
Hanoi | 10 అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
KA Paul | చంద్రబాబు అరెస్ట్ సరైనదే : కేఏ పాల్
Ashok Gehlot | రాజస్థాన్ సీఎంకు తల వెంట్రుకలు పంపి నిరసన తెలిపిన సొంత పార్టీ ఎమ్మెల్యే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

