Hanoi | 10 అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
Hanoi | వియత్నాం (Vietnam) లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని హనోయ్ (Hanoi)లోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Hanoi | వియత్నాం (Vietnam) లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని హనోయ్ (Hanoi)లోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
నైరుతి హనోయిలోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పార్కింగ్ ఫ్లోర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. దాదాపు 54 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 70 మందిని సురక్షితంగా రక్షించారు. ఇది చాలా తీవ్రమైన అగ్ని ప్రమాదం అని ఏజెన్సీ పేర్కొంది. కాగా, ప్రమాదం సంభవించిన భవనంలో సుమారు 45 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
KA Paul | చంద్రబాబు అరెస్ట్ సరైనదే : కేఏ పాల్
Ashok Gehlot | రాజస్థాన్ సీఎంకు తల వెంట్రుకలు పంపి నిరసన తెలిపిన సొంత పార్టీ ఎమ్మెల్యే
Satinder Kumar Khosla | సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

