Satinder Kumar Khosla | సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Satinder Kumar Khosla | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా (Satinder Kumar Khosla) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
Satinder Kumar Khosla | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు తాజాగా కన్నుమూశారు. బీర్బల్ (Birbal)గా బాలీవుడ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన నటుడు, షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా (Satinder Kumar Khosla) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఖోస్లా మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
సతీందర్ ఖోస్లా.. బాలీవుడ్ లో ఉపకార్, రోటీ కప్డా ఔర్ మకాన్ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ‘షోలే’ చిత్రం ద్వారా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో ఖైదీగా ఖోస్లా పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాల్లో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
Also Read..
Kerala High Court | పోర్న్ వీడియోలను అలా చూస్తే తప్పేమీ కాదు : కేరళ హైకోర్టు
BRS Meeting | నేడే జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్.. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత మార్గదర్శనం
Trisha | ఆ డైరెక్టర్‌కు పదేండ్ల తర్వాత రిప్లై ఇచ్చిన త్రిష.. ఇంతకీ అతను ఏమడిగాడంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

