Flights Cancelled | అమెరికాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. 2,600 విమానాల రాకపోకలు రద్దు
Flights Cancelled | అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
న్యూయార్క్: అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రద్దయిన, ఆలస్యంగా నడుస్తున్న విమానాల్లో మెజారిటీ విమానాలు నార్త్ ఈస్ట్ రీజియన్‌కు చెందినవే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దయితే, అందులో నార్త్ ఈస్ట్ రీజియన్‌కు చెందిన 1,320 ఉన్నాయి. అందులో న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే 350 విమానాలు నిలిచిపోయాయి. కాగా, ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా జాన్ ఎఫ్ కెన్నడీ, లా గార్డియన్ విమానాశ్రయాలపై అధికంగా ఉన్నది.
అమెరికా ఫ్లైట్ అవేర్ డాటా ప్రకారం.. జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో 318 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. మరో 426 విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక లాగార్డియా విమానాశ్రయంలో 270 విమానాలు రద్దయ్యాయి. ఇంకో 292 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. మరో 459 విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

