వాషింగ్టన్, ఫిబ్రవరి 4: ఒక లైంగిక నేరస్తునితో తన భర్తకు ఉన్న సంబంధం తమ 27 సంవత్సరాల వివాహ బంధం ముగిసిపోవడానికి కారణమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ బిలియనీర్ బిల్‌గేట్స్ మాజీ సతీమణి మెలిండా గేట్స్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లను అమెరికా ఇటీవల విడుదల చేయగా, అందులో బిల్ గేట్స్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భర్త గురించి ఎన్పీఆర్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నా వరకు వ్యక్తిగతంగా ఇలాంటి వివరాలు బయటకు రావడం చాలా కష్టం కలిగిస్తున్నది. ఎందుకంటే నా వైవాహిక జీవితంలోని చాలా బాధాకరమైన క్షణాలను అవి జ్ఞప్తికి తెస్తున్నాయి’ అని ఆమె పేర్కొన్నారు.