భారత్‌తో సహా 24 దేశాల నుంచి విమానాలు నిలిపివేసిన ఒమన్

మస్కట్: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఒమన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌తో సహా 24 దేశాల నుంచి ప్రయాణికుల విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు 24 దేశాల నుంచి ప్రయాణ విమానాలను రద్దు చేసినట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల విమానాలను ఒమన్ నిలిపివేసిన జాబితాలో బ్రిటన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాలు ఉన్నాయి.
కాగా, బుధవారం ఒమన్‌లో కొత్తగా 1,675 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,235కు చేరింది. ఒమన్‌లో ఇప్పటి వరకు 3,356 మంది కరోనా వల్ల మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

