జకర్తా నుంచి నుసంతరకు రాజధాని మార్పు!
రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించనుంది. జకర్తాలో విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఈ నగరానికి భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు కారణంగానే రాజధానిని మార్చాలని ఇండోనేషియా
- ఇండోనేషియా నిర్ణయం
జకర్తా, జనవరి 6: రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించనుంది. జకర్తాలో విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఈ నగరానికి భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు కారణంగానే రాజధానిని మార్చాలని ఇండోనేషియా నిర్ణయించింది. జకర్తాలో విపరీతం భూగర్భ జలాలను తోడుతుండటం వల్ల ప్రమాదకర రీతిలో సగటున ఏడాదికి ఆరు సెంటీమీటర్లు మునిగిపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి పావువంతు జకర్తా నగరం నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
భూకంపాల ముప్పు కూడా ఈ నగరానికి ఎక్కువ. మరోవైపు ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో జకర్తా ఒకటి. ఇక్కడ మూడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యంతో ఈ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ నేపథ్యంలో రాజధానిని నుసంతరకు మార్చాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భౌగోళికంగా సురక్షితమైన ప్రాంతంగా గుర్తించింది. నుసంతర ప్రపంచంలోనే అతి పురాతనమైన రెయిన్‌ఫారెస్ట్‌కు నెలవు. జనాభా కూడా 40 లక్షలు మాత్రమే ఉంది. దీంతో నుసంతరకు రాజధానిని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 56,180 హెక్టార్లను గుర్తించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

