లాస్‌వెగాస్: ఎవరైనా గట్టిగా ఫోన్ మాట్లాడుతుంటే వినే వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. అలానే నలుగురిలో ఫోన్ మాట్లాడాలంటే బయటకు వినిపిస్తుందేమో అనే భయమూ కొందరిలో ఉంటుంది. వీటన్నింటికీ సొల్యూషనే తమ మాస్క్ అంటున్నది ఫ్రాన్స్‌కు చెందిన స్కైటెడ్ అనే సంస్థ.
ఈ మాస్క్ పెట్టుకొని ఫోన్ మాట్లాడితే బయటకు ఏమాత్రం వినిపించదు. పైగా అవతలి వారికి చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఎలాంటి బయటి శబ్దాలు వారికి వినిపించవు. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదట.