తీవ్రమైన ఆహార కొరత నిజమే : కిమ్ జాంగ్

ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉన్నది. ఈ విషయాన్ని ఆ దేశాధినేత కిమ్ జాన్ ఉన్ అంగీకరించారు. దేశంలో ఆహార నిల్వలు అడుగంటిపోయినట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కిమ్ మాట్లాడారు. ఆహార కొరత వల్ల ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయినట్లు ఆయన వెల్లడించారు. టైఫూన్ల వల్ల వరదలు రావడంతో ఆహార ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఆహార ధరలు ఆకాశాన్ని అంటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం నార్త్‌కొరియాలో ఒక కిలో అరటిపండ్లు 45 డాలర్లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ వల్ల నార్త్‌కొరియా తన సరిహద్దుల్ని మూసివేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనాతోనూ వాణిజ్యాన్ని బ్రేక్ చేసింది. దీంతో ఉత్తరకొరియాలో తీవ్ర కరువు ఏర్పడింది. ఫుడ్, ఫెర్టిలైజర్, ఫ్యూయల్ కోసం చైనా మీదనే ఉత్తర కొరియా ఆధారపడుతుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ క్వార్టర్లో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగినట్లు ఆయన చెప్పారు. గతంలోనూ ఓసారి ఉత్తరకొరియాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 1990 దశకంలో ఆ కరువు వచ్చింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం వల్ల అప్పట్లో ఉత్తరకొరియాకు కీలక సాయం అందలేదు. ఆ సమయంలో సుమారు 30 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

