North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
North Korea: జలాంతర్గాముల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా చెప్పింది. రెండు రకాల క్షిపణులను మిలిటరీ పరీక్షించినట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొన్నది.
సియోల్: ఉత్తర కొరియా(North Korea) తన ఆయుధ సంపదను పెంచుకుంటోంది. అయితే జలాంతర్గాముల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా చెప్పింది. రెండు రకాల క్షిపణులను మిలిటరీ పరీక్షించినట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొన్నది. బుధవారం తూర్పు జలాల్లో ఈ పరీక్ష జరిగినట్లు చెప్పింది. వ్యూహాత్మక ఆయుధాలు.. న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగలని ఉత్తరకొరియా చెప్పింది. అయితే తాజా పరీక్ష నిజంగా సబ్మెరైన్న ఉంచి జరిగిందా లేక అండర్‌వాటర్ టెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌లో పరీక్ష జరిగిందా ఇంకా తెలియదు.
ఈ పరీక్షతో తమ అండర్‌వాటర్ యుద్ధ వ్యవస్థను పరీక్షించినట్లు స్థానిక మీడయా తెలిపింది. నేవీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు చెప్పింది. ఈ పరీక్షలపై దక్షిణ కొరియా మిలిటరీ ఇంకా స్పందించలేదు. ఇటీవల సెప్టెంబర్ 20, అక్టోబర్ 3 తేదీల్లో హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలను పరీక్షించినట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. అయితే దక్షిణ కొరియా, జపాన్ దేశాల ఆయుధాలకు ధీటుగా ఉండేందుకు తాజా పరీక్షలు చేపట్టినట్లు తెలిసింది.
ఉత్తర కొరియా ఇటీవల లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. ఓ కొత్త యుద్ధనౌకను కూడా జలప్రవేశం చేయించింది. దక్షిణకొరియాతో సహకారం, దౌత్యాన్నినిలిపివేస్తున్నట్లు ఇటీవల కిమ్ పేర్కొన్నారు. దక్షిణ కొరియాను శాశ్వత శత్రువుగా ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

