North Korea | ఆయన అమెరికా ఆటబొమ్మ : ఆంటోనియో గట్టర్స్పై ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి విమర్శలు
ఐక్యారాజ్యసమితి సిద్ధాంతాలుకు విరుద్ధంగా గట్టర్స్ ప్రవర్తిస్తున్నందుకు చింతిస్తున్నాను
North Korea : ఈమధ్య ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేసిన ఉత్తర కొరియా దుందుడుకు తీరుపై అగ్రదేశాలు విరుచుకుపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్ కూడా మిస్సైల్ టెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఈమధ్య ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను వెంటనే ఆపేయండని ఉత్తర కొరియాకు మరోసారి ఆయన హితవు పలికారు. ఐరాస అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చో సన్ హూ గట్టర్స్ని అమెరికా ఆటబొమ్మ అంటూ విమర్శించారు.
నేను ఆంటోనియో గట్టర్స్ను వైట్‌హౌస్ సభ్యుడిగా లేదా స్టేట్ మెంబర్‌గానే భావిస్తాను. ఐక్యారాజ్యసమితి సిద్ధాంతాలు, విలువలకు విరుద్ధంగా ఆంటోనియో గట్టర్స్ ప్రవర్తిస్తున్నందుకు చింతిస్తున్నాను. అన్ని విషయాల్లోనూ పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. దీన్ని బట్టి ఆయన అమెరికా చేతిలో ఆటబొమ్మ అయ్యారని అర్థమవుతోంది అని చో సన్ విమర్శలు గుప్పించారు. నవంబర్ 2వ తేదీన ఉత్తర కొరియా 25 క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వీటిలో చాలావరకు అమెరికా భూభాగాలను లక్ష్యంగా దాడులు చేయగలవు. దాంతో, అగ్రదేశం అమెరికా, దక్షిణ కొరియాతో పాటు పలుదేశాలు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను ఖండించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

