North Korea: అమెరికా సైనికుడిని బంధించిన ఉత్తర కొరియా
North Korea: అమెరికా సైనికుడు తమ ఆధీనంలో ఉన్నట్లు నార్త్ కొరియా తెలిపింది. డీమిలిటరీ జోన్లో ఉన్న అతను అక్రమంగా సరిహద్దు దాటాడు. దీంతో అతన్ని ఉత్తర కొరియా అరెస్టు చేసింది.
ప్యోంగ్యాంగ్: అమెరికా సైనికుడు ట్రావిస్ కింగ్ తమ కస్టడీలో ఉన్నట్లు ఉత్తర కొరియా(NorthKorea) స్పష్టం చేసింది. అమెరికా సైనికుడి ఆచూకీ చెప్పాలంటూ ఐక్యరాజ్యసమితి అభ్యర్థన చేసింది. ఆ అభ్యర్థనకు ఉత్తర కొరియా స్పందించినట్లు యూఎన్ కమాండ్ తెలిపింది. 23 ఏళ్ల ఆ సైనికుడు జూలై 18వ తేదీన దక్షిణ కొరియా బోర్డర్ నుంచి ఉత్తర కొరియాలోకి చొరబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దశలో ఆ జవాను గురించి ఎక్కువగా చెప్పలేమని యూఎన్ కమాండ్ పేర్కొన్నది. డీమిలిటరీ జోన్ నుంచి యూఎన్ కమాండ్ ఉత్తర కొరియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిజానికి పీవీ2 కింగ్ అరెస్టు గురించి నార్త్ కొరియా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దక్షిణ కొరియాలో రెండు నెలలు జైలులో ఉన్న అతన్ని జూలై 10న రిలీజ్ చేశారు. ఆ తర్వాత అతను అమెరికాకు వెళ్లకుండా.. డీమిలిటరీ జోన్ సైన్యంతో జతకలిశారు. అక్కడ నుంచి అతను ఉత్తర కొరియాలోకి చొరబడే ప్రయత్నం చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

