ఉత్తర కొరియాలో విజృంభిస్తున్న కరోనా.. తొలి మరణం నమోదు
North Korea | కిమ్ రాజ్యంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. 2019 చివర్లో చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఇప్పుడు ఉత్తర కొరియాను (North Korea) వణికిస్తున్నది. దేశంలో మొదటి కరోనా కేసులు గురువారం నమోదయింది.
ప్యాంగాంగ్: కిమ్ రాజ్యంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. 2019 చివర్లో చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఇప్పుడు ఉత్తర కొరియాను (North Korea) వణికిస్తున్నది. దేశంలో మొదటి కరోనా కేసులు గురువారం నమోదయింది. అయితే ఒక్క రోజు వ్యవధిలో మరో బాధితుడు మహమ్మారితో కన్నుమూసినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది.
కాగా, దేశంలో 18 వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని మే 12న అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,87,800కు చేరిందని.. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. కాగా, వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కిమ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.
అయితే ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోలేదు. మహమ్మారిని అడ్డుకోవడానికి తాము టీకాలు అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. కాగా, 2020 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

