Extramarital Affiar | వివాహేతర సంబంధం పెట్టుకున్నారా.. అయితే మీ ఉద్యోగం హుష్ కాకే!
Extramarital Affiar | వివాహేతర సంబంధం పెట్టుకున్నారా? అయితే ఉద్యోగం ఊడినట్లే! అక్రమ సంబంధం మాత్రమే కాదు ఉంపుడుగత్తెలు ఉన్నా.. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చిన ఉద్యోగం వదులుకోవాల్సిందే. చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది.
Extramarital Affiar | వివాహేతర సంబంధం పెట్టుకున్నారా? అయితే ఉద్యోగం ఊడినట్లే! అక్రమ సంబంధం మాత్రమే కాదు ఉంపుడుగత్తెలు ఉన్నా.. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చిన ఉద్యోగం వదులుకోవాల్సిందే. చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్సనల్ లైఫ్ వేరు.. ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా ఆఫీసు అయిపోయాక మా ఇష్టమొచ్చినట్లు ఉంటే ఇక కుదరదని హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని ఎవరు ఉల్లంఘించినా వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.
ఈ నెల 9వ తేదీన చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ కంపెనీ జారీ చేసింది. ఈ నిబంధన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉద్యోగుల్లో నైతికతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు చైనా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. వివాహేతర సంబంధాల వల్ల దాంపత్య జీవితం సాగదని.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే.. ఇంట్లో ప్రశాంతత ఉండదని.. అప్పుడు పనిలో కూడా ఏకాగ్రత చూపలేరని పేర్కొంది. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఉంపుడుగత్తెలు ఉండటం, విడాకులు తీసుకోవడం వంటి అంశాలను నిషేధించింది. ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే ఉద్యోగులగా, మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఈ నిబంధనల పట్ల చైనాలో మిశ్రమ స్పందన వస్తుంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై కూడా నిబంధనలను తీసుకురావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఒక ఉద్యోగిని అతని పనితీరు ఆధారంగానే తొలగించాలి తప్ప వ్యక్తిగత జీవితం ఆధారంగా తొలగించడం న్యాయపరంగా సరైంది కాదని అంటున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా కుటుంబ విలువలు నిలబడతాయని మరికొంతమంది వాదిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

