Aliens | ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా.. నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు
Aliens | గ్రహాంతర జీవులు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా (యూఏఎఫ్)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.
Aliens | వాషింగ్టన్, సెప్టెంబర్ 14: గ్రహాంతర జీవులు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫినామినా (యూఏఎఫ్)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్‌వో)ల గురించి పరిశోధనలు చేసేందుకు గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఏర్పాటు చేసిన యూఎఫ్‌వో స్టడీ టీం తన నివేదికను గురువారం నాసాకు సమర్పిచింది. గ్రహాంతర జీవులు, యూఎఫ్‌వోల గురించి సరైన సాక్ష్యాధారాలు తమకు లభించలేదని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఆధారాలు లభించలేదని చెబుతూనే అదే టీంను తాజాగా యూఏఎఫ్లపై పరిశోధనలు చేసేందుకు నియమించడంపై పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విశ్వంలో ఏదో ఒక చోట కచ్చితంగా జీవం ఉండొచ్చని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పేర్కొనడం దానికి బలాన్ని చేకూరుస్తున్నది. యూఏఎఫ్లను చూశామని కొందరు చెప్పినప్పటికీ, అందుకు తగిన సాక్ష్యాలు లేవని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫ్యాక్స్ పేర్కొన్నారు. ఇటీవల పలువురు అమెరికా మాజీ ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు యూఏఎఫ్లను చూసినట్టు చెప్పడంతో ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Aliens
- Bill Nelson
- NASA
- UFOs
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

