విల్లింగ్టన్: సూపర్‌మార్కెట్స్‌లో పలుచని ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ స్ట్రాలు, సిల్వర్‌వేర్ వాడకాన్ని కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. శనివారం నుంచి ఇది అమల్లోకి రాబోతున్నదని తెలిపింది.
దీంతో పలుచని ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని బ్యాన్ చేసిన మొదటి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. కాగా న్యూజిలాండ్‌లోని లిబరల్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలేవీ పర్యావరణ పరిరక్షణకు దోహద పడటం లేదని విమర్శలకు పెదవి విరుస్తున్నారు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారం ఏమాత్రమూ తగ్గలేదనిఅన్నారు.