ఎలుకలను పట్టుకొంటే కోటి 38 లక్షల జీతం!
అవును మీరు చదివింది నిజమే. యూఎస్‌లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్టును సృష్టించారు. ఈ ఉద్యోగికి వార్షిక వేతనం రూ. కోటి 38 లక్షల 55 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు.
న్యూయార్క్: అవును మీరు చదివింది నిజమే. యూఎస్‌లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్టును సృష్టించారు. ఈ ఉద్యోగికి వార్షిక వేతనం రూ. కోటి 38 లక్షల 55 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ వివరాలను ఆడమ్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎలుకలంటే తనకు అసహ్యమని ఆడమ్స్ పేర్కొన్నారు. ‘న్యూయార్క్ నగరంలో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా? మీరు ఎలుకలను చాకచక్యంగా పట్టుకోగలరా? అయితే, మీ కలల ఉద్యోగం రెడీగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు మేయర్ ఆఫీస్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ఉద్యోగాన్ని ‘చిట్టెలుక ఉపశమన డైరెక్టర్’ (డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్) అని పిలుస్తారని, ఏడాదికి 170వేల డాలర్ల వేతనం ఉంటుందని పేర్కొంది. అభ్యర్థికి దీర్ఘదృష్టిగల నాయకత్వ లక్షణాలు, సత్తువ, ఎలుకలను పట్టుకొనే సామర్థ్యంలాంటి అర్హతలు ఉండాలని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Eric Adams
- New York
- rats
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

