New York is Sinking | కుంగుతున్న న్యూయార్క్.. ఏటా 1.6 మిల్లీ మీటర్లు భూమి లోపలికి: నాసా
న్యూయార్క్ నగరం కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, రుట్జర్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేశారు.
- పైకి చొచ్చుకొస్తున్న నగరంలోని కొన్ని ప్రాంతాలు
- నాసా అధ్యయనంలో వెల్లడి
New York is Sinking | న్యూయార్క్: న్యూయార్క్ నగరం కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, రుట్జర్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం చేశారు.
రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ సాయంతో…
2016-2023 మధ్యకాలంలో పరిశోధకులు రిమోట్ సెన్సింగ్ టెక్నిక్ సాయంతో దీనిపై అధ్యయనం చేశారు. ఇంటర్‌ఫెరోమెట్రిక్ సింథటిక్ అపాచ్యుర్ రాడార్ (ఐఎన్‌ఎస్‌ఏఆర్) టెక్నాలజీతో భూ కదలికల (వర్టికల్ ల్యాండ్ మోషన్)పై అధ్యయనం చేశారు. నిర్మాణాలు, పునరుద్ధరణ పనులతో పాటు సహజ సిద్ధమైన కొన్ని కారణాల వల్ల భూమి కుంగిపోతున్నదని పరిశోధకులు గుర్తించారు. ఎర్త్ మాంటిల్ సర్దుకుపోవడం కారణంగా కూడా ఈ పరిణామం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పైకి చొచ్చుకొస్తున్న విలియమ్స్బర్గ్..
నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలోని ఓ రన్‌వే ఏటా 3.7 మిల్లీ మీటర్లు, ఆర్థర్ యాష్ స్టేడియం 4.6 మిల్లీ మీటర్ల మేర కుంగిపోతున్నది. మరోవైపు విలియమ్స్బర్గ్, బ్రూక్లిన్, వుడ్‌సైడ్, క్వీన్స్ తదితర ప్రాంతాలు ఏటా 1.6- 6.9 మిల్లీ మీటర్ల వరకు భూమి పైకి చొచ్చుకొస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

