New covid Variant | ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్.. భారత్‌లో ఐదుగురిలో ఎక్స్‌బీబీ వేరియంట్ గుర్తింపు
New covid Variant | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్‌లో దవాఖానల్లో బెడ్స్ దొరకడం లేదు. ఇండియాలో ఐదు కొత్త వేరియంట్ కేసులు నమోదవడం కలవరపెట్టే అంశం.
New covid Variant | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. చైనా, బ్రిటన్‌లోని దవాఖానల్లో బెడ్స్ దొరకడం లేదు. ఉక్రెయిన్‌లో కరోనా కారణంగా ప్రతి వారం 50-70 మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో కూడా పరిస్థితి అంత బాగా లేదు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 సంబంధించిన 5 కేసులు భారత్‌లో నమోదయ్యాయి. గుజరాత్లో 3, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు INSACOG తెలిపింది. మరోవైపు, మాస్కులు ధరించవద్దని సర్క్యులర్ జారీ చేసిన మహిళా వైద్యురాలికి జర్మనీలోని వెన్హీమ్ కోర్టు శిక్ష విధించింది.
భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 175 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 2,570 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో 52, కర్ణాటకలో 34, మహారాష్ట్రలో 16, ఢిల్లీలో 11, తమిళనాడులో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటివరకు 13 దేశాలు ఆంక్షలు విధించాయి. తైవాన్ నుంచి వచ్చే వారికి కూడా కొవిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. ఏ దేశానికి చెందిన వారైనా చైనా నుంచి తమ దేశంలోకి రాకుండా మొరాకో ఇప్పటికే నిషేధం విధించింది.
జర్మనీలోని నైరుతి నగరం వెన్హీమ్లోని స్థానిక కోర్టు ఒకటి అక్కడి మహిళా వైద్యురాలికి జైలు శిక్ష విధించింది. 4,000 మందికి మాస్క్‌లు ధరించవద్దని సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై కోర్టులో విచారణ సందర్భంగా.. మాస్క్‌లు ధరించడం ప్రజల ఆరోగ్యానికి హానికరం అని మహిళా డాక్టర్ వాదించారు. ఆమె వాదనతో ఏకీభవించని కోర్టు ఆమెకు 2 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షతోపాటు 3 ఏండ్ల పాటు ప్రాక్టీస్ చేపట్టకుండా నిషేధం విధించింది. ఆమె సహాయకురాలికి 2700 యూరోల జరిమానా విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

