కరోనా కొత్త టీకా… ఒమిక్రాన్తోసహా అన్ని వేరియంట్లకు చెక్!
లండన్: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ వేగంగా వ్యాపిస్తుండటంతో బ్రిటన్, చైనాలో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అయితే తాము అభివృద్ధి చేసిన కొత్త టీకాతో ఒమిక్రాన్‌తో సహా అన్ని వేరియంట్లకు చెక్ చెప్పవచ్చని ఆస్ట్రియా పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్‌తో సహా ఇప్పటి వరకు గుర్తించిన అన్ని కరోనా వేరియంట్లపై ఈ టీకా పని చేస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని, ఎలాంటి రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఈ కొత్త టీకా ద్వారా లభిస్తుందన్నారు. ఈ అధ్యయాన్ని అలెర్జీ జర్నల్‌లో ప్రచురించారు.
వియన్నా మెడికల్ యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకా యాంటిజెన్ ఆధారిత వ్యాక్సిన్. కరోనా వైరస్ (SARS-CoV-2) రిసెప్టర్ బైండింగ్ డొమైన్లను (RBD) ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. మానవులు, జంతు నమూనాల్లో జరిపిన పరీక్షలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఏకరీతిలో రిసెప్టర్ బైండింగ్ డొమైన్లను, నిర్దిష్ట (IgG) యాంటీబాడీ ప్రతిస్పందనను ఇది ప్రేరేపిస్తుందని చెప్పారు. దీంతో కరోనా వైరస్ కణాలు శరీరంలోకి ప్రవేశించకుండా ఈ యాంటీబాడీ ప్రతిస్పందన నిరోధిస్తుందని, తద్వారా ఇన్ఫెక్షన్ సోకదని పరిశోధకులు తెలిపారు.
మరోవైపు పాత, కొత్త కరోనా వేరియంట్ల స్టెరిలైజింగ్ రోగనిరోధక శక్తిని ప్రేరేపించే సామర్థ్యం PreS-RBD వ్యాక్సిన్ కలిగి ఉందని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన రుడాల్ఫ్ వాలెంటా తెలిపారు. శరీరంలోకి వైరస్ ప్రవేశం, రెప్లికేషన్ను ఈ టీకా నిరోధించడం ద్వారా సంక్రమణను అరికడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో గతంలో కరోనా టీకాకు స్పందించని వ్యక్తులలో కూడా ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఈ ఏడాదిలో ఆమోదం లభించవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

