న్యూయార్క్, నవంబర్ 13: క్యాన్సర్కు కీమోథెరపీ చికిత్స తప్ప వేరే చికిత్స లేదు. ఈ వ్యాధి నివారణకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. అయితే, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) పరిశోధకులు రూపొందించిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలుకల్లో సత్ఫలితాలను ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ ఎలుకల శరీరంలోని కణితులపై పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచిందని గుర్తించారు. ఈ టీకా సైటోటాక్సిక్ టీ సెల్స్ చొరబడే సామర్థ్యాన్ని పెంచి కణితులపై దాడిచేసేలా చేసిందని, సహజమైన రోగ నిరోధక వ్యవస్థను సృష్టించిందని పరిశోధకులు కనుగొన్నారు. ‘స్నాప్వ్యాక్స్’గా పిలుస్తున్న ఈ ప్రయోగాత్మక టీకాను ప్రొఫెసర్ రాబర్ట్ సెడెర్ తన సహచరులతో కలిసి రూపొందించారు.