Imran Khan | ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్న పాక్.. పంజాబ్ ప్రావిన్స్‌లో 1,000 మంది అరెస్ట్
Imran Khan | అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాక్ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం అరెస్టైన (Arrest) విషయం తెలిసిందే. ఖాన్ అరెస్ట్ తర్వాత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్ (Punjab province) లో దాదాపు 1,000 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
Imran Khan | అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాక్ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం అరెస్టైన (Arrest) విషయం తెలిసిందే. అవినీతి కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. ఖాన్ అరెస్ట్‌తో ప్రస్తుతం ఆ దేశం అల్లర్లతో అట్టుడికిపోతోంది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ (PTI) కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు (Police), ఆర్మీ ఆందోళన కారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఖాన్ అరెస్ట్ తర్వాత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్ (Punjab province) లో దాదాపు 1,000 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు సుమారు 130 మంది అధికారులు గాయపడినట్లు తెలిపారు.
అల్లర్ల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. 144 సెక్షన్ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్‌లోని ఆర్మీ కమాండర్ ఇంటిపై ఇమ్రాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రావల్పిండి, లాహోర్, కరాచీ, గుర్జాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్లలో పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
Also Read..
Sudha Murthy | నారాయణ మూర్తితో మొదటి పరిచయం అలా జరిగింది.. హ్యాండ్సమ్గా ఉంటారనుకున్నా : సుధామూర్తి
Priyanka Chopra | చాలా మందితో డేటింగ్ చేశా.. వారంతా ఎంతో గొప్ప వ్యక్తులు : ప్రియాంక చోప్రా
Pakistan | ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్.. జరభద్రమంటూ తమ పౌరులకు సూచించిన యూఎస్, యూకే, కెనడా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

