NASA | ఆదిత్య ఎల్-1 విజయవంతం.. అభినందించిన నాసా శాస్త్రవేత్త
NASA | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 హాలో విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 తర్వాత మరో మైలురాయిని చేరింది. తొలి ప్రయత్నంలోనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు.
NASA | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 హాలో విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 తర్వాత మరో మైలురాయిని చేరింది. తొలి ప్రయత్నంలోనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) శాస్త్రవేత్త డాక్టర్ అమితాబ్ ఘోష్ సైతం ఇస్రోను ప్రశంసించారు. ప్రయోగాన్ని అద్భుతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. శాస్త్రీయంగా ముఖ్యమైందన్నారు. భారత్ ప్రస్తుతం చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోందని.. గగన్‌యాన్ కోసం సన్నాహాలు చేస్తుందన్నారు.
గత ఇస్రోతో సహా అంతరిక్ష ప్రపంచంలో అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. ఆదిత్య ఎల్ విజయం తర్వాత సైన్స్, అంతరిక్ష ప్రపంచంలో భారత్ ఎక్కడ నిలబడిందో చూస్తే.. ఇది చాలా ఉత్తేజకరమైన, అద్భుతమైన ప్రయాణం అన్నారు. ఇదిలా ఉండగా.. భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1ను ఇస్రో శనివారం విజయవంతంగా లాంగ్రాంజ్ పాయింట్-1ని చేరింది. ఇస్రో ఆదిత్య ఎల్-1ని సెప్టెంబర్ 2న ప్రారంభించింది. మిషన్ విజయవంతమైన తర్వత ఇస్రో చీఫ్ సోమనాథ్ మామాట్లాడుతూ.. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 సరైన స్థానంలో ఉందన్నారు. శాస్త్రవేత్తలు కొన్ని గంటల పాటు పరిశీలిస్తారని.. అనుకున్న మార్గం నుంచి కొంచెం తప్పుకుంటే మళ్లీ.. దిద్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Aditya L-1
- Amitabh Ghosh
- ISRO
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

