ISKCON Temple | అమెరికాలోని హిందూ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ఖండించిన భారత్
ISKCON Temple | అగ్రరాజ్యం అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్‌పై (ISKCON Temple) కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
ISKCON Temple | అగ్రరాజ్యం అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయం ఇస్కాన్‌పై (ISKCON Temple) కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉటా (Utah) రాష్ట్రంలోని స్పానిష్ ఫోర్క్ (Spanish Fork)లో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు (Multiple Shots Fired) తెగబడ్డారు. భక్తులు ఆలయంలో ఉన్న సమయంలో దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆలయ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇక ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)లోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ‘ఉటాలోని స్పానిష్ ఫోర్క్‌లో గల ఇస్కాన్ శ్రీశ్రీరాధా కృష్ణ ఆలయంలో జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆలయ అధికారులకు, భక్తులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నాము. దాడికి పాల్పడిన నేరస్థులను గుర్తించి శిక్షించాలి’ అని కాన్సులేట్ తన ట్వీట్లో పేర్కొంది.
ఇక ఈ కాల్పుల ఘటనలో ఆలయ స్వాగత తోరణాలు, గోడలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోడల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం సాధారణ దాడి కాదని, హిందూ సమాజంపై విద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్కాన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
We strongly condemn the recent firing incident at the ISKCON Sri Sri Radha Krishna temple in Spanish Fork, Utah. The Consulate extends full support to all the devotees and the community and urges the local authorities to take prompt action to bring the perpetrators to justice.…
— India in SF (@CGISFO) July 1, 2025
Also Read..
Viral Photo | ఒకే చిత్రంలో సోలార్ ఫ్లేర్స్, ఐఎస్ఎస్.. ! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో..!
Elon Musk | ఆ బిల్లును ఆమోదిస్తే.. కొత్త పార్టీ పెడతా!.. బిగ్ బ్యూటిపుల్ బిల్లుపై మస్క్ ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

