Israel-Hamas War | యూరప్ మ్యూజిక్ అవార్డ్స్‌ను రద్దు చేసిన ఎంటీవీ
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య భీకరపోరు కొనసాగుతుండటంతో యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ షోను ఎంటీవీ రద్దు చేసింది.
లండన్ : ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas War) మధ్య భీకరపోరు కొనసాగుతుండటంతో యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ షోను ఎంటీవీ రద్దు చేసింది. ప్యారిస్‌లో నవంబర్ 5న ఈ పెర్ఫామెన్స్ ప్యాక్డ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఒజున, రెనీ ర్యాప్, థర్టీ సెకండ్స్ టూ మార్స్ సందడి చేయనుండగా చివరి నిమిషంలో ఇది రద్దయింది.
ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ గ్లోబల్ మ్యూజిక్ వార్షిక సంబరాలుగా ఏటా అలరిస్తుంటాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఇది సంతాపం తెలిపే సందర్భమని కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ షోను అశేష ప్రేక్షకుల ముందుంచేందుకు ప్రపంచవ్యాప్తంగా తరలిరానున్న వేలాది ఉద్యోగులు, సిబ్బంది, ఆర్టిస్ట్‌లు, ఫ్యాన్స్, పార్టనర్స్ భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యూజిక్ అవార్డ్స్ షోను క్యాన్సిల్ చేయాలనే సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
2024 నవంబర్‌లో యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతుందని ఎంటీవీ పేర్కొంది. గత ఏడాది జరిగిన మ్యూజిక్ అవార్డ్స్‌లో బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ వీడియో, బెస్ట్ లాంగ్ఫాం వీడియో సహా నాలుగు ట్రోఫీలను గెలుచుకుని టేలర్ స్విఫ్ట్ బిగ్ విన్నర్‌గా నిలిచాడు.
Read More :
Viral Video | కదులుతున్న కారు పైకప్పుపై పటాకులు పేల్చిన వ్యక్తి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

