Mr Beast | యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ సరికొత్త రికార్డు.. 50 కోట్ల సబ్స్క్రైబర్లు దాటిన తొలి క్రియేటర్..!
Mr Beast | ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ (You Tuber) గా పేరొందిన మిస్టర్ బీస్ట్ (Mr Beast) సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్స్క్రైబర్లు (500 Million Subscribers) దాటిన తొలి క్రియేటర్‌గా నిలిచాడు. 2026 జూన్ 12న మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో 50 కోట్ల సబ్స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్ చరిత్రలో ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు.
Mr Beast : ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ (You Tuber) గా పేరొందిన మిస్టర్ బీస్ట్ (Mr Beast) సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్‌లో 50 కోట్ల సబ్స్క్రైబర్లు (500 Million Subscribers) దాటిన తొలి క్రియేటర్‌గా నిలిచాడు. 2026 జూన్ 12న మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో 50 కోట్ల సబ్స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్ చరిత్రలో ఇది మరో మైలురాయిగా చెప్పవచ్చు.
కాగా మిస్టర్ బీస్ట్ ఫిబ్రవరి 2012లో తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. అప్పుడు అతడి వయసు 13 ఏళ్లు. 2017లో అతడు అంకెలను లక్ష వరకు లెక్క పెడుతూ చేసిన వీడియోకు విస్తృత ప్రజాదరణ లభించింది. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ డోనాల్డ్సన్. అతడు తన ‘బీస్ట్ ఫిలాంత్రపీ’ ఛానల్ పైన వచ్చే మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తుంటాడు. చెట్లను నాటడం, సముద్రాల శుభ్రత, పేదలకు ఇళ్లు, ఆహారం అందించే ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతుంటాడు.
బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలకు విముక్తి కలిగించడంతోపాటు ‘లైట్ ఏఐ’ అనే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టి స్మార్ట్‌ఫోన్, ఏఐ పరిజ్ఞానంతో టెస్టులు చేయిస్తూ అవసరం అయిన వారికి చికిత్సలూ చేయిస్తున్నాడు. ‘ఘనా మేక్ ఎ డిఫరెన్స్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి గుండె జబ్బులున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలతో సర్జికల్ సెంటర్‌ను ప్రారంభించాడు. కెన్యా, జింబాబ్వే, ఉగాండా ప్రాంతాల్లోని పిల్లలకు మంచినీరు అందించడం కోసం వంద బావులు తవ్వించాడు. వీటన్నిటి వీడియోలను ఆయన యూట్యూబ్‌లో పంచుకుంటాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కొట్లాది మంది మిస్టర్ బీస్ట్‌ను అభిమానిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

