MP Anwarul Azim Anar: బంగ్లాదేశ్ ఎంపీ కోల్‌కతాలో హత్య .. ముగ్గురు అరెస్టు
MP Anwarul Azim Anar: బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్యకు గురయ్యాడు. కోల్‌కతాలోని ఫ్లాట్‌లో అతన్ని మర్డర్ చేసినట్లు అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. ఈ హత్య కేసుతో లింకున్న ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్(MP Anwarul Azim Anar) హత్యకు గురయ్యాడు. కోల్‌కతాలోని ఫ్లాట్‌లో అతన్ని మర్డర్ చేసినట్లు అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. ఈ హత్య కేసుతో లింకున్న ముగ్గురు వ్యక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ అన్వరుల్ను హత్య చేసిన ముగ్గురూ బంగ్లాదేశీలు అని , చాలా ప్లాన్ ప్రకారం మర్డర్ జరిగిందని మంత్రి వెల్లడించారు. అయితే ఎంపీ అన్వరుల్ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఏ కారణం చేత అతన్ని హత్య చేశారో తెలియదని, ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు. జెనాయిదా-4 నియోజకవర్గం నుంచి అజిమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జెనాయిదా బోర్డర్ ప్రాంతమని, అక్కడ క్రైం రేట్ ఎక్కువగా ఉంటుంది. చికిత్స కోసం ఇండియా వెళ్లిన సమయంలో అక్కడ అతన్ని హత్య చేశారని బంగ్లా హోంమంత్రి తెలిపారు. అన్వరుల్ మృతి పట్ల ప్రధాని షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

