Green card rules : అగ్రరాజ్యం అమెరికా (USA) లో శాశ్వత నివాస హక్కు (Green Card) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ఇటీవల స్పష్టంచేసింది. అయితే ఈ రూల్ అందరికీ కాదని తెలుస్తోంది. తాజాగా అమెరికా ఆ రూల్స్‌లో కొన్ని మినహాయింపులు ప్రకటించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపులు ఇస్తామని తెలిపింది.
గ్రీన్‌కార్డ్ ఆశావహులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తమ దేశానికి ప్రయోజనం ఉందని భావిస్తే.. వాటిని తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నది. దాంతో వారు ప్రస్తుతం నిబంధనల ప్రకారమే కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పింది. మిగతా వారిని వారి మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోమని సూచిస్తామని USCIS ప్రతినిధి జాక్ కహ్లర్ వెల్లడించారు. అవి తమ దేశానికి ప్రయోజనం కలిగించే వ్యక్తుల నుంచి వచ్చిన దరఖాస్తులు అని ఎలా నిర్ణయిస్తారో మాత్రం ఆయన వెల్లడించలేదు.