Liberia | లైబీరియాలోని పేలిన ఆయిల్ ట్యాంకర్.. 40 మంది మృతి
Liberia | పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రెటోల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సమయంలో ట్యాంకర్లో పేలుడు సంభవించింది. దీంతో మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు.
Liberia | పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రెటోల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో పెట్రోల్ ట్యాంక్‌ను గమనించిన స్థానికులు, క్షణాల్లో అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక ట్యాంకర్ నుంచి పెట్రోల్‌ను తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సమయంలో ట్యాంకర్లో పేలుడు సంభవించింది. దీంతో మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

