మంటల్లో కీవ్ బిల్డింగ్లు.. మెట్రో స్టేషన్ ధ్వంసం.. 4 రష్యా హెలికాప్టర్ల కూల్చివేత
కీవ్: రష్యా ఇవాళ తెల్లవారుజామున భీకర ఫైరింగ్ జరిపింది. కీవ్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. జనావాసాలను టార్గెట్ చేశారు. కీవ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లు ఆ దాడికి ధ్వంసం అయ్యాయి. సతోసిన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల బిల్డింగ్ మంటల్లో చిక్కుకున్నది. దానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ ఘటనలో ఎవరైనా మృతిచెందారా అన్న విషయాన్ని ఇంకా తెలుపలేదు. మరో టార్గెట్‌లో మెట్రో స్టేషన్ ధ్వంసమైంది. లుకియానిస్కా మెట్రో స్టేషన్‌ను పేల్చేశారు. కీవ్ సెంటర్‌కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. డ్యామేజ్ కావడం వల్ల ఆ స్టేషన్‌ను మూసివేశారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేటితో 20 రోజులకు చేరుకున్నది. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ సైనిక దళాల చీఫ్ కొంత సమాచారం అందజేశారు. రష్యాకు చెందిన నాలుగు హెలికాప్టర్లు, ఓ విమానంతో పాటు క్రూయిజ్ మిస్సైల్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దళాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్లు ఉక్రెయిన్ చెప్పింది. క్షిపణులు, బాంబులతో కీలక మౌళికసదుపాయాలపై రష్యా దాడులు చేస్తూనే ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

