WHO on Monkeypox | మంకీఫాక్స్‌పై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.. నివారణకు ఇలా!
WHO on Monkeypox | మంకీ పాక్స్‌ను పూర్తిగా విశ్లేషించి నివారణ చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో అధికారి మరియా వాన్కెర్కోవ్ అన్నారు.
WHO on Monkeypox | కరోనా ప్రభావంతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రపంచ దేశాలను మంకీ ఫాక్స్ వణికిస్తున్నది. 27 దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు 780 కేసులు నమోదు కావడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డబ్ల్యూహెచ్‌వో అధికారి మరియా వాన్కెర్కోవ్ సూచనలు చేశారు. మంకీ పాక్స్ వైరస్ ఏమిటి? ఎలా వ్యాపిస్తుందన్న అంశాలపై మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు, పౌర సమాజంలో అవగాహన పెంపొందించాలని సూచించారు. వైద్య సదుపాయాల సాయంతో వైరస్‌ను గుర్తించొచ్చునన్నారు. వైరస్ సోకిందని భావిస్తున్న అనుమానితులతోపాటు వారిని కలిసిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించడం అవసరం అని చెప్పారు.
ఇందుకోసం స్థానికులతో మాట్లాడి, అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని మరియా వాన్కెర్కోవ్ పేర్కొన్నారు. మంకీ పాక్స్ బాధితుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపేవారు, బాధితులకు వైద్య సేవలందించే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. ఈ వైరస్ గురించి తగిన సమాచారం అంతా తెలుసుకోవాలన్నారు.
ఈ వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడానికి అన్ని రకాల పద్దతులు అవలంభించాలని మరియా వాన్కెర్కోవ్ స్పష్టం చేశారు. యాంటీ వైరల్ ఔషధాలు, టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే వాటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. అలాగే మంకీ పాక్స్ వైరస్ గురించి పూర్తి డేటా విశ్లేషించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరిశోధనలు ముమ్మరం చేయాలని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

