పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన
Monkeypox | మంకీపాక్స్ ముప్పు పెరుగుతున్నది. మహమ్మారి కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు మంకీపాక్స్ 92 దేశాలకు విస్తరించగా.. 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 12 మంది ప్రాణాలుకోల్పోయారు. గతవారం సుమారు 7,500 కేసులు నమోదయ్యాయని, గతవారంతో పోలిస్తే 50శాతం పెరిగాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. టీకాలను వేయాలని సూచించారు.
మంకీపాక్స్ నియంత్రణలో టీకాలు సైతం ముఖ్యపాత్రను పోషిస్తాయన్నారు. ఇటీవల మంకీపాక్స్ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లను ప్రకటించింది. కొత్త వేరియంట్ల క్లాడ్-1, క్లాడ్-2 ఏ, క్లాడ్-2 బీగా పేర్లు పెట్టింది. 2బీ ఈ ఏడాదిలో కొత్త వేరియంట్ గ్రూప్. మంకీపాక్స్కు వెంటనే కొత్త పేర్లను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ వైరస్కు కొత్త పేర్లను పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం సాంస్కృతిక, సామాజిక నేరాలను నివారించడమేనని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

