Putin: పుతిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదంటే.. మంగోలియా ఇచ్చిన వివరణ ఇదే
Putin: పుతిన్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్‌కోర్టు (ఐసీసీ) ఆదేశాలు ఇచ్చినా.. మంగోలియా ఆ చర్యకు పాల్పడలేదు. ఐసీసీ ఇచ్చిన అరెస్టు వారెంట్‌ను మంగోలియా పట్టించుకోలేదు. ఎనర్జీ అవసరాల కోసం పొరుగుదేశాలపై తాము ఆధారపడుతామని, అందుకే తటస్థంగా ఉన్నట్లు మంగోలియా అధికారి ఒకరు తెలిపారు.
ఉలన్‌బాటర్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)ను అరెస్టు చేయాలని గతంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని రోజుల క్రితం మంగోలియాలో పుతిన్ పర్యటించారు. ఈ సందర్భంగా అతన్ని అరెస్టు చేయాలని ఐసీసీ తన వారెంట్‌లో తెలిపింది. కానీ ఆ అరెస్టు వారెంట్‌ను ఐసీసీ పట్టించుకోలేదు. తటస్థ విధానం, ఇంధన అవసరాల దృష్ట్యా ఆ విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
యుద్ధ నేరాలకు పాల్పడిన పుతిన్ ను అరెస్టు చేయాలని ఇటీవల ఐసీసీ వారెంట్ జారీ చేసింది. అయితే ఎనర్జీ అవసరాల కోసం పొరుగుదేశాలపై మంగోలియా ఆధారపడుతుందని, అందుకే తటస్థంగా ఉన్నట్లు మంగోలియా అధికారి ఒకరు తెలిపారు. ఐసీసీలో మంగోలియా సభ్యదేశమే. 95 శాతం పెట్రోలియం ఉత్పత్తులతో పాటు 20 శాతం విద్యుత్తును రష్యా నుంచి మంగోలియా దిగుమతి చేసుకుంటోంది.
దౌత్య సంబంధమైన విషయాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నట్లు మంగోలియా వెల్లడించింది. అధ్యక్షుడు ఉకనాగిన్ కురేల్‌సుక్ ఆహ్వానం మేరకు పుతిన్ మంగోలియాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

