Mustafa Suleyman: ముస్తాఫా సులేమాన్‌కు మైక్రోసాఫ్ట్ ఏఐ బాధ్యతలు
Mustafa Suleyman: డీప్‌మైండ్ కోఫౌండర్ ముస్తాఫా సులేమాన్‌ను.. తమ కన్జ్యూమర్ ఏఐ డివిజన్‌కు అధిపతిగా మైక్రోసాఫ్ట్ నియమించింది. కాపిలాట్, బింగ్, ఎడ్జ్ లాంటి ప్రోడక్ట్స్‌ను అతనే చూసుకోనున్నాడు. ఇన్ఫ్లెక్షన్ ఏఐ స్టార్టప్ సంస్థకు చెందిన కొంత మంది ఉద్యోగుల్ని కూడా మైక్రోసాఫ్ట్ నియమించుకోనున్నది.
శాన్ ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్ కోసం బ్రిటీష్ నిపుణుడు ముస్తాఫా సులేమాన్(Mustafa Suleyman)ను రిక్రూట్ చేశారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ఇన్ఫ్లెక్షన్ ఏఐ స్టార్ట్ అప్‌కు సులేమాన్ ప్రస్తుతం అధిపతిగా ఉన్నారు. డీప్ మైండ్ అనే ఏఐ సంస్థకు ఆయన కో ఫండింగ్ చేస్తున్నారు. బ్రిటన్‌లో ప్రఖ్యాతి గాంచిన ఏఐ సంస్థగా డీప్‌మైండ్‌కు గుర్తింపు ఉన్నది. దీన్ని 2014లో గూగుల్ సంస్థ కొనేసింది.
ఏఐ డివిజన్‌కు సులేమాన్‌ను నియమించిన మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ రంగంలో మరింత దూసుకెళ్లనున్నది. అయితే ఏఐ శాఖలో గూగుల్ సంస్థ ఇంకా వెనుకంజలోనే ఉన్నది. కొత్త పొజిషన్‌ను తీసుకునేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు సులేమాన్ తన ఎక్స్ అకౌంట్లో తెలిపాడు. తనతో పనిచేసే వారిని మైక్రోసాఫ్ట్‌కు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించాడు. చీఫ్ సైంటిస్ట్ కారెన్ సిమోనియన్ తనతో వస్తున్నట్లు చెప్పాడు.
కన్జ్యూమర్ ఏఐ ప్రొడక్ట్స్ అన్నింటినీ లీడ్ చేయనున్నట్లు చెప్పాడు. క్యాపిటల్ చాట్‌బాట్, బింగ్, ఎడ్జ్ కు తానే నాయకత్వం వహించనున్నట్లు తెలిపాడు. కన్జ్యూమర్ ఏఐ రీసెర్చ్ విభాగానికి సులేమాన్ నాలెడ్జ్, ట్యాలెంట్, అనుభవం పనికి వస్తుందని భావిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

