Michelle Obama | నాకు ఏది మంచో అదే చేస్తా.. విడాకుల రూమర్స్‌పై మిషెల్ ఒబామా
Michelle Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama), ఆయన సతీమణి మిషెల్ ఒబామా (Michelle Obama) విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్‌పై మిషెల్ తాజాగా స్పందించారు.
Michelle Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama), ఆయన సతీమణి మిషెల్ ఒబామా (Michelle Obama) విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్‌పై మిషెల్ తాజాగా స్పందించారు. అలాంటిదేమీ లేదని విడాకుల వార్తలను కొట్టిపారేశారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్‌కాస్ట్‌లో నటి సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా సంభాషించారు. ఈ సందర్భంగా విడాకులపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకుంటున్నారు. నేను మాత్రం నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది నేను చేయను’ అని మిషెల్ చెప్పుకొచ్చారు.
భార్యతో రిలేషన్లో ఒడిదిడుకులు..
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైవాహిక బంధంలో ఒడిదిడుకులను ఎదుర్కొన్నట్లు బరాక్ ఒబామా తెలిపారు. అందుకే ఇప్పుడు తన భార్య మిషెల్ ఒబామాతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. హామిల్టన్ కాలేజీ ప్రెసిడెంట్ స్టీవెన్ టెప్పర్‌తో జరిగిన చర్చలో బరాక్ ఒబామా ఈ విషయాన్ని తెలిపారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష హోదాలో ఉండడం వల్ల.. భార్య మిషెల్ ఒబామాతో రిలేషన్ దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. భార్య మిషెల్‌తో బంధంలో తీవ్ర లోటు ఏర్పడినట్లు చెప్పారు. అయితే అప్పుడు ఏర్పడిన అగాధాన్ని ఇప్పుడు చిన్న చిన్న సరదాలతో తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. వైట్‌హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తన భార్యతో రిలేషన్ ఇంప్రూవ్ అయినట్లు బరాక్ వెల్లడించారు.
కాగా, ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘ఫ్రెండ్స్’ స్టార్ జ్నెనిఫర్ అనిస్టన్‌తో ఒబామా డేటింగ్ చేస్తున్నారని, ఈ కారణంగా మిషెల్‌తో సంబంధాలు సత్సంబంధాలు దెబ్బతిన్నాయంటూ అమెరికా మీడియాలో కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు పలు అధికారిక కార్యక్రమాలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరుకావటం, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా రావటం లేదని మిషెల్ ప్రకటించటం, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరుకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read..
“Barack Obama | జెన్నిఫర్‌తో ఒబామా డేటింగ్?.. మిషెల్‌తో విడాకులకు కారణం అదేనా?”
“Barack Obama | భార్యతో డిన్నర్.. విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఒబామా.!”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

