Barack Obama | వాషింగ్టన్ : ‘ఫ్రెండ్స్’ స్టార్ జ్నెనిఫర్ అనిస్టన్తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతుల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, జెనిఫర్ ఫ్రెండ్ ఒకరి నుంచి లీక్ అయినట్లు చెప్తున్న సమాచారం ప్రకారం, ఒబామాతో డేటింగ్ గురించి జెనిఫర్ సన్నిహితులకు తెలుసు!.
విడిపోతున్న ఒబామా దంపతులు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు అధికారిక కార్యక్రమాలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరుకావటం, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా రావటం లేదని మిషెల్ ప్రకటించటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈ అంశంపై ‘న్యూయార్క్ పోస్ట్’ కూడా ఓ వార్తా కథనం వెలువరించింది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరైన సంగతిని ఓ నెటిజన్ గుర్తుచేశాడు.