Barack Obama | భార్యతో డిన్నర్.. విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఒబామా.!
Barack Obama - Michelle Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాతో విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ జీవితానికి ప్రాధాన్యతను ఇస్తూ.. ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట.
Barack Obama – Michelle Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాతో విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ జీవితానికి ప్రాధాన్యతను ఇస్తూ.. ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ జంట విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టాడు ఒబామా. శుక్రవారం మిచెల్ బర్త్‌డే కావడంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
నా జీవితంను ప్రేమతో నింపిన నా ప్రేయసి మిచెల్ ఒబామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలోని ప్రతి గదిని నీ వెచ్చదనంతో, నాలెడ్జ్‌తో, హాస్యంతో నింపావు. ఇలా చేయడం వలన ఇంకా బాగున్నావు. నీతో జీవిత సాహసాలు చేయడంలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని అంటూ బరాక్ ఒబామా రాసుకోచ్చాడు.
మరోవైపు విడాకులు వార్తలపై మిచెల్ టీం కూడా స్పందించింది. విడాకులు తీసుకోనున్నారని వస్తున్న వార్తలు అబద్దం అని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయకండి అంటూ పేర్కోంది. బరాక్ ఒబామా మిచెల్ దంపతులు 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సాషా, మలియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life’s adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4
— Barack Obama (@BarackObama) January 17, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

