US Iran Deal | నేడు స్విట్జర్లాండ్లో అమెరికా -ఇరాన్ ప్రతినిధులు సమావేశం..ఏర్పాట్లు పూర్తి చేసిన స్విస్
పశ్చిమాసియాలో(West Asia) శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్(US Iran Deal )యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గురువారం సంతకం చేశారు.
హైదరాబాద్ : పశ్చిమాసియాలో(West Asia) శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్(US Iran Deal )యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గురువారం సంతకం చేశారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఒప్పందంపై సంతకం చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. హొర్ముజ్ జలసంధి తక్షణమే తెరుచుకుంటుందని పేర్కొన్నది. జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్ ప్యాలెస్లో జరిగిన విందులో ట్రంప్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ నేపథ్యంలో నేడు స్విట్జర్లాండ్లో అమెరికా -ఇరాన్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. శుక్రవారం స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్ పర్వత ప్రాంత రిసార్ట్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. అందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పందంపై డిజిటల్ సంతకాలు పూర్తి కాగా నేటి ఇరు దేశాల సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

