ఇండోనేషియా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం

జకర్తా: ఇండోనేషియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. 950 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలంగన్ రిఫైనరీ ఘటనలో పలువురు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. వెస్ట్ జావా ప్రావిన్సులో ఉన్న రిఫైనరీ నుంచి సోమవారం ఉదయం కూడా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్ముకున్నది. తీవ్రంగా గాయపడ్డ అయిదుగురితో పాటు స్వల్పంగా గాయపడ్డ 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది. జకర్తా ప్రాంతానికి మొత్తం బలంగన్ రిఫైనరీ నుంచే ఇంధనం సరఫరా జరుగుతుంది. 1994 నుంచి ఆ రిఫైనరీ పనిచేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

