45 నిమిషాల పాటు బాత్రూమ్లో భర్త.. భార్య ఏం చేసిందంటే..?
బాత్రూమ్లో భర్త | ఓ భర్త భార్యతో గడపాల్సిన సమయం కంటే ఎక్కువగా బాత్రూమ్లో గడుపుతున్నాడు. రోజుకు ఒకసారి కాదు.. నాలుగైదు సార్లు 45 నిమిషాల చొప్పున బాత్రూమ్లోనే ఆ భర్త గడిపేస్తున్నాడు. ఇంట్లోనే కాదు.. బయటకు

ఓ భర్త భార్యతో గడపాల్సిన సమయం కంటే ఎక్కువగా బాత్రూమ్లో గడుపుతున్నాడు. రోజుకు ఒకసారి కాదు.. నాలుగైదు సార్లు 45 నిమిషాల చొప్పున బాత్రూమ్లోనే ఆ భర్త గడిపేస్తున్నాడు. ఇంట్లోనే కాదు.. బయటకు వెళ్లినప్పుడు కూడా ఆ భర్త అలానే బాత్రూమ్కు అధిక సమయం కేటాయిస్తున్నాడు. దీంతో సదరు భార్యకు కోపమొచ్చి ఆ వార్తను ప్రపంచానికి తెలియజేసింది.
‘నా భర్త జస్టిన్.. ఎక్కువ సమయం బాత్రూమ్లోనే గడిపేస్తున్నాడు. కొత్త ఇంటికి మారిన తర్వాత.. ఆ బాత్రూమ్లో రోజుకు నాలుగైదు సార్లు.. 45 నిమిషాల చొప్పున దాంట్లోనే ఉంటున్నాడు.
ఇంట్లోనే కాదు.. రెస్టారెంట్లో కూడా..
ఇంట్లోనే కాదు.. ఇటీవల ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం.. టేబుల్‌పైకి భోజనం వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే జస్టిన్ రెస్టారెంట్‌లోని బాత్రూమ్లోకి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో విసుగుచెందాను. ఓపిక నశించిపోయింది. తక్షణమే బాత్రూమ్ వద్దకు వెళ్లి అడగ్గా.. కొద్ది సెకన్లలోనే బయటకు వస్తానని చెప్పాడు. అయినప్పటికీ ఆ సమయం మించిపోయింది. చేసేదేమీ లేక బాత్రూమ్లో ఉన్న భర్తకు ఫోన్ కాల్స్ చేసినా, మేసేజ్ చేసినా స్పందించలేదు.
చేసేదేమీ లేక భోజనం తినేసి..
ఇక భర్త బాత్రూమ్లో నుంచి రాకపోయేసరికి నాకు సరిపడ భోజనం తినేసి బయటకు వచ్చేశాను. నా భోజనం వరకు ఛార్జ్ చెల్లించి, టిప్ కూడా ఇచ్చాను. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్యాక్సీ బుక్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఇంటికి వచ్చిన 20 నిమిషాల తర్వాత జస్టిన్ ఇంటికొచ్చాడు. రెస్టారెంట్లో భోజనం తినేసి ఇంటికి రావడంతో స్వార్థంగా ప్రవర్తించావు అని భర్త కోపమయ్యాడు’ అని సదరు మహిళ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Couples
- Husband
- Restaurant
- Washroom
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

