Guinness World Records | టమాటా సాస్ ప్రతి కిచెన్‌లో కొలువుతీరి పలు డిష్‌లకు స్పెషల్ టేస్ట్‌ను అందిస్తుంటుంది. కూరలు, సల్సా, పాస్తాస్ సహా ఎన్నో డిషెస్‌లో మనం దీన్ని వాడుతుంటాం. అయితే మొత్తం లీటర్ టమాటా సాస్‌ను (World Record) ఓ వ్యక్తి అమాంతం తాగడం గురించి ఎన్నడూ మీరు విని ఉండరు. ఇది అసాధారణం అనిపించినా జర్మనీకి చెందిన అండ్రే ఒటాల్ఫ్ అన్నంత పనీ చేశాడు.
అతితక్కువ సమయంలో లీటర్ టమాటా సాస్ తాగేసి అండ్రే ఏకంగా వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు. కేవలం 55.21 సెకండ్లలో లీటర్ టమాటా సాస్‌ను తాగేసి తన పేరును గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కించేశాడు. అండ్రీ ఘనతను చాటేందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అతగాడు ఈ ఫీట్‌ను సాధించిన వీడియోను ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో లీటర్ టమాటా సాస్‌ను ఉంచిన చెక్క టేబుల్‌కు ఎదురుగా నిలుచుని సీసాను ఖాళీ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. స్ట్రా ఉపయోగించి సీసాలోని సాస్‌ను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అతడు జుర్రేశాడు. లీటర్ టమాటా సాస్‌ను అతితక్కువ సమయంలో తాగేశాడు : 55.21 సెకండ్ల వ్యవధిలోనే ఆండ్రే ఒటాల్స్ ఈ ఘనత సాధించాడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :