వీల్‌చైర్‌తో రైలు పట్టాలపై పడిన వ్యక్తి.. కాపాడిన ప్రయాణికుడు

వాషింగ్టన్: వీల్‌చైర్‌లో ఉన్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం పైనుంచి రైలు పట్టాలపై పడ్డాడు. గమనించిన ఒక ప్రయాణికుడు సాహసం చేసి అతడ్ని కాపాడాడు. కొన్ని సెకండ్లలో రైలు స్టేషన్‌కు చేరుకోనుండగా తోటి ప్రయాణికుల సహాయంతో సురక్షితంగా ఫ్లాట్ఫాంపైకి చేర్చాడు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో యూనియన్ స్క్వేర్ రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తి దానితో సహా ఫ్లాట్‌ఫాం పైనుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడ్డాడు. గమనించిన ఒక ప్రయాణికుడు వెంటనే కిందకు దూకాడు. వీల్‌చైర్‌ను ఫ్లాట్ఫాంపైకి చేర్చాడు. తోటి ప్రయాణికుల సహాయంతో ఆ వ్యక్తిని కూడా ఫ్లామ్ఫాంపైకి లాగడంతోపాటు అతడు కూడా వెంటనే పైకి వచ్చాడు. అనంతరం పది సెకండ్లలో రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది.
మరోవైపు తోటి ప్రయాణికులు ఉత్కంఠగా దీనిని గమనించారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీల్చైర్తోసహా రైలు పట్టాలపై పడిన వ్యక్తిని కాపాడిన ప్రయాణికుడు, సహాయం చేసిన ఇతరులను నెటిజన్లు అభినందించారు.
https://www.instagram.com/reel/CSKs0n0jdfQ/?utm_source=ig_web_copy_link
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

