వినూత్నంగా లవ్ ప్రపోజల్.. గర్ల్ ఫ్రెండ్ కోసం సముద్రంలోకి దూకేశాడు.. వీడియో వైరల్
Love Propose | ప్రేమ రెండు మనసుల మధ్య చిగురించేది. ఆ రెండు మనసులు ఏకమైతే ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ అంతకంటే ముందు జరిగే లవ్ ప్రపోజల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఆ ప్రపోజల్
Love Propose | ప్రేమ రెండు మనసుల మధ్య చిగురించేది. ఆ రెండు మనసులు ఏకమైతే ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ అంతకంటే ముందు జరిగే లవ్ ప్రపోజల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఆ ప్రపోజల్ జీవితాంతం తీపి గుర్తుగా ఉండాలని ప్రతి ప్రేమికుడు ఆరాట పడుతుంటారు. అందుకే వినూత్నంగా లవ్ ప్రపోజల్ చేస్తుంటారు. ఈ ప్రేమికుడు కూడా వినూత్నంగా లవ్ ప్రపోజల్ చేయాలనుకుని సముద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ తన ప్రేయసితో కలిసి బోటులో షికారుకు వెళ్లాడు. సముద్రం మధ్యలో, చల్లని గాలులను ఆస్వాదిస్తూ ఆలింగనాలతో మునిగిపోయింది ఆ జంట. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ప్రేమికుడు తన ప్రేయసికి ఐ లవ్ యూ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. కానీ అక్కడే అనుకోని ఘటన జరిగింది. కాసేపు ఆ జంట తీవ్ర గందరగోళానికి గురైంది.
అదేంటంటే.. ప్రియుడు స్కాట్ క్లెయిన్ తన ప్రియురాలి వేలికి ఉంగరం తొడిగేందుకు తన జేబులో నుంచి ఆ ఉంగరాన్ని బయటకు తీశాడు. కానీ ఆ రింగ్ నీటిలో పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా క్లెయిన్ నీటిలో దూకేశాడు. ప్రేయసితో పాటు అక్కడున్న మరో ఇద్దరు ఆందోళనకు గురయ్యారు. ఉంగరం బాక్స్ నీటిపై తేలియాడంతో క్షణాల్లోనే దాన్ని పట్టుకున్నాడు క్లెయిన్. ఇక ఆ ఉంగరాన్ని బోటులో ఉన్న వ్యక్తికి అందించాడు. అనంతరం అతను బోటులోకి వచ్చేశాడు. ఆ తర్వాత ప్రియురాలు సుజీ టక్కర్ వేలికి ఆ రింగ్‌ను తొడిగి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించి, ముద్దులతో ముంచెత్తింది.
ఈ వీడియోను స్కాట్ క్లెయిన్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది 100 శాతం నిజం, 100 శాతం నా అదృష్టం. 100 శాతం ఎప్పటికీ మరిచిపోను అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి ప్రేమను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రియుడు ఇలా ఉండాలని కొనియాడుతున్నారు. ఆమె అదృష్టవంతురాలు అని పేర్కొంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

