British Airways Uniform | 20 ఏండ్ల తర్వాత బ్రిటిష్ ఎయిర్వేస్ కొత్త యూనిఫామ్స్.. హిజాబ్ ధరించేలా మార్పులు
British Airways Uniform | బ్రిటిష్ ఎయిర్వేస్ తన సిబ్బందికి కొత్త యూనిఫామ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 ఏండ్ల తర్వాత కొత్త యూనిఫాంలలో సిబ్బంది మెరవనున్నారు. హిజాబ్ ధరించేందుకు కూడా అనుమతించారు.
British Airways Uniform | బ్రిటిష్ ఎయిర్వేస్ 20 ఏళ్ల తర్వాత యూనిఫాంలో భారీ మార్పులు తీసుకొచ్చింది. క్యాబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే అవకాశం కల్పించారు. ఈ యూనిఫాంను ప్రఖ్యాత బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ ఓజ్వాల్డ్ బోటెంగ్ రూపొందించడం విశేషం. యూనిఫాం మార్పులపై బోటెంగ్ బృందం మూడేండ్ల పాటు పరిశోధనలు చేసింది. నిజానికి ఈ మార్పులు 2021 లో తీసుకురావాల్సి ఉండగా.. కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమైంది.
బ్రిటిష్ ఎయిర్వేస్ తమ వద్ద పనిచేసే మహిళా సిబ్బందికి యూనిఫాంలో అనేక ఆప్షన్లను ఇచ్చింది. ఇందులో హిజాబ్, జంప్‌సూట్, డ్రెస్, స్కర్ట్, ట్రౌజర్ వంటివి ఉన్నాయి. జంప్‌సూట్‌ను తొలుత మహిళా చెక్-ఇన్ సిబ్బందిపై పరీక్షించనున్నారు. అనంతరం ఈ ఏడాది మధ్యలో క్యాబిన్ క్రూలోని మహిళలు ధరించేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తం 30 వేల మంది సిబ్బంది బ్రిటిష్ ఎయిర్వేస్లో పనిచేస్తున్నారు. తమ కొత్త యూనిఫాం ప్రత్యేకమైన బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నదని, ఆధునిక బ్రిటన్ను సూచిస్తుందని బ్రిటిష్ ఎయిర్వేస్ చైర్మన్, సీఈఓ సీన్ డోయల్ తెలిపారు.
బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ కూడా గతేడాది సెప్టెంబర్‌లో తమ యూనిఫాంలో మార్పులు తీసుకొచ్చింది. మగ పైలట్, సిబ్బందికి స్కర్టులు వేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే మహిళలు ప్యాంటు వేసుకునే వెసులుబాటు కల్పించారు. లింగ భేదం లేకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అప్పట్లో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

