Newziland Earthquake | న్యూజిలాండ్‌లో భారీ భూకంపం..!
న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది.
Newziland Earthquake | న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరపరము (Paraparaumu) పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో.. 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. భూకంపం ధాటికి వెల్లింగ్టన్లో కొన్ని సెకన్లపాటు బలమైన వణుకులు సంభవించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు న్యూజిలాండ్‌ను గత కొన్నిరోజులుగా గాబ్రియెల్ తుఫాను (Cyclone Gabriel) వణికిస్తోంది. నార్త్ ఐలాండ్, ఆక్లాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

